Long Way Round
2004లో, ఇవాన్ మెక్ గ్రెగర్, చార్లీ బూర్మన్లు కలిసి ఒక మహత్తరమైన సాహసానికి శ్రీకారం చుడతారు. 12 దేశాలు, 19 టైమ్ జోన్స్ ను కవర్ చేసేలా 32,000 కిలోమీటర్లను 115 రోజుల్లోనే మోటర్ సైకిళ్ళ మీద తిరిగేయాలని వారి ప్లాన్. లాంగ్ వే సిరీస్ లోని ఈ తొలి అధ్యాయంలో, ఈ ప్రాణ స్నేహితులు అన్ని అడ్డంకులనూ అధిగమించి తమ కలను సాకారం చేసుకుంటారు.