Palmer
పన్నెండేళ్ల జైలు జీవితం గడిపాక, మాజీ హై స్కూల్ ఫుట్ బాల్ స్టార్ అయిన ఎడ్డీ పామర్, తన జీవితాన్ని గాడిలో పెట్టుకొనేందుకు ఇంటికి తిరిగి వస్తాడు—అనేక సమస్యలు గల కుటుంబానికి చెందిన, అలాగే అందరి చేత చీదరింపుకు గురయ్యే శ్యామ్ అనే పిల్లవాడితో ఒక అనుకోని బంధాన్ని ఏర్పర్చుకుంటాడు. కానీ ఇంతలో ఎడ్డీ గతం, తన కొత్త జీవితాన్ని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తుంది.