భైరవ గీత
గీత ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన యువతి. ఉన్నత చదువులు పూర్తిచేసుకొని ఆమె తన ఊరికి తిరిగొస్తుంది. కొన్ని రోజుల తర్వాత తన తండ్రి అనుచరుడైన భైరవ మీద ఇష్టం ఏర్పడుతుంది, ఆ ఇష్టమే ప్రేమగా మారుతుంది. అలా భైరవకు కూడా గీత మీద ప్రేమపుడుతుంది. ఈ విషయం తెలిసిన గీత తండ్రి, భైరవను చంపాలని ఆదేశించడంతో, ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకుంటారు.
